బిజెపిని గద్దె దించేందుకు వరకు పోరాటం.. అందుకే స్టాలిన్ తో కేసీఆర్ భేటీ : పల్లా సంచలనం

బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చే అన్ని శక్తులతో తెలంగాణ సిఎం కేసీఆర్‌ కలుస్తారు.. బీజేపీపై ఫైట్‌ చేసేవాళ్లకు మా మద్దతు ఉంటుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ పిలిస్తే … కేసీఆర్ వెళ్లి కలుస్తారని.. ఎన్డీఏ సర్కార్ దిగిపోయే వరకు మా పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. బిజెపి పార్టీ పై పోరాటం విషయంలో పోరాడే శక్తులతో సమయానుకూలంగా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని.. కేంద్రంలో బీజేపీని గద్దె దించే శక్తులతో కేసీఆర్‌ చర్చలు, సరైన సమయంలో కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకుంటారని తేల్చి చెప్పారు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.

రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వం మాకు వద్దని.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాటం ఆగదని.. మా వరి కొనే ప్రభుత్వాలకే మా మద్దతు ఉంటుందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో దాన్యం సేకరణ కొనసాగుతుందని.. సిగ్గులేకుండా బిజెపి నేతలు గవర్నర్ ను దాన్యం సేకరణ కేంద్రాలకు పంపారన్నారు. మొహం మీద కొట్టినట్టు అంత బాగుంది అని రైతులు వారికి సమాధానం ఇచ్చారని.. 5447 కోట్ల రూపాయల విలువైన దాన్యం సేకరించి …రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసామనీ పేర్కొన్నారు. 7 వేల దాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసామని.. నిత్యం పీయూష్ గోయల్,కిషన్ రెడ్డిలు అబద్ధలు చెబుతున్నారని నిప్పులు చెరిగారు.