మునుగోడు ఉప ఎన్నిక టికెట్ పాల్వాయి స్రవంతికి ఇవ్వడం పై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు. ఓ కార్యకర్త అయిన పాల్వాయి స్రవంతి కి టికెట్ ఇవ్వడం మంచిదేనన్నారు. డబ్బులు ముఖ్యం కాదు..పార్టీ కార్యకర్తలకు టికెట్ ఇవ్వడం అంటే గౌరవం ఇవ్వడం అన్నారు. కానీ పార్టీ సీనియర్ నాయకులను పరిగణలోకి తీసుకోవడం లేదన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంగతి ఏంటనేది తెలియడం లేదన్నారు విహెచ్.
పార్టీ అధిష్టానం ఏం కో ఆర్డినేషన్ చేస్తుందో అని అసహనం వ్యక్తం చేశారు. పాల్వాయి స్రవంతి ఒరిజినల్ కాంగ్రెస్ వ్యక్తి అని.. ఆమెకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. కానీ సీనియర్ లను అసలు పరిగణలోకి కూడా తీసుకోలేదన్నారు. హైకమాండ్ ఎవరితో సంప్రదిస్తూ ఉంది.. ఏంటి అనేది తెలియదన్నారు. సీఎం కెసిఆర్ కి గవర్నర్ కి మద్య తగాదా ఎంటో తెలియాలన్నారు. తన నలబై ఎండ్ల జీవితం లో ఇలా మాట్లాడిన గవర్నర్ లేరని అన్నారు. ఇద్దరి మధ్య గ్యాప్ ఏ విషయం లో వచ్చింది అనేది ప్రజలకు తెలియాలన్నారు.