ప్రస్తుతం దేశంలో 43 కోట్ల మందికి పాన్ కార్డులు ఉన్నాయి. 120 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. కానీ.. వాళ్లలో 23 కోట్ల మంది మాత్రమే పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించుకున్నారు.
మీరు పాన్ కార్డు ఉందా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. ఆగస్టు 31 తర్వాత మీ పాన్ కార్డులు పనిచేయవు. వచ్చే నెల 31లోపు మీ పాన్ కార్డును.. మీ ఆధార్ నెంబర్‌తో లింక్ చేసుకోవాల్సిందే. ఆగస్టు 31 వరకు మీరు ఆధార్ నెంబర్‌తో మీ పాన్ కార్డును లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు చెల్లదు. అంటే మీ పాన్‌కార్డును.. ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడానికి ఇంకా 40 రోజులు మాత్రమే సమయం ఉంది.
ప్రస్తుతం దేశంలో 43 కోట్ల మందికి పాన్ కార్డులు ఉన్నాయి. 120 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. కానీ.. వాళ్లలో 23 కోట్ల మంది మాత్రమే పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించుకున్నారు. మిగితా 20 కోట్ల మంది లింక్ చేయలేదు. ఈ 40 రోజుల్లో మిగితా 20 కోట్ల మంది కూడా తమ పాన్ కార్డును.. ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే.. అవన్నీ చెల్లవని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్స్ వెల్లడించింది.
చాలామంది ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు తీసుకొని అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలియడంతో… ఆధార్‌తో పాన్‌కార్డును లింక్ చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం భావించింది. పాన్ కార్డుతో ఆధార్ నెంబర్‌ను అనుసంధానం చేస్తే.. ఎటువంటి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండదు. అక్రమంగా పాన్ కార్డు తీసుకున్న వాళ్ల జాతకాలన్నీ బయటపడుతాయి.
అయితే.. ఐటీ రిటర్న్స్ కోసం పాన్ కార్డు లేకున్నా… ఆధార్ కార్డు వాడొచ్చని బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.