టీడీపీ కొంప ముంచింది.. చిన‌బాబు లోకేషే.. టీడీపీ ఎమ్మెల్సీ తీవ్ర విమ‌ర్శ‌లు..!

-

నారా లోకేష్ వ‌ల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింద‌ని స‌తీష్ ఆరోపించారు. టీడీపీలో లోకేష్ పెత్త‌నం బాగా పెరిగిపోయింద‌ని, ఆయన గ్రూపుల‌ను త‌యారు చేశార‌ని స‌తీష్ అన్నారు.

అస‌లే అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో దారుణంగా ఓడిపోయి.. నేత‌ల రాజీనామాల‌తో.. టీడీపీ ప‌రిస్థితి మూలిగే న‌క్క మీద తాటికాయ ప‌డ్డ చందంగ మారితే.. ఇప్పుడు ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు కుమారుడు లోకేష్‌పై సొంత పార్టీ నేత‌లే తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్తున్న చాలా మంది నేత‌లు లోకేష్‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా టీడీపీని వీడి బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ అన్నం స‌తీష్ కుమార్ నారా లోకేష్‌పై ఒక రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేశారు.

నారా లోకేష్ వ‌ల్లే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింద‌ని స‌తీష్ ఆరోపించారు. టీడీపీలో లోకేష్ పెత్త‌నం బాగా పెరిగిపోయింద‌ని, ఆయన గ్రూపుల‌ను త‌యారు చేశార‌ని స‌తీష్ అన్నారు. టీడీపీని హెరిటేజ్ సంస్థ‌లా మార్చి పార్టీని చిన్నాభిన్నం చేశార‌న్నారు. ఎన్‌టీఆర్ స్థాపించిన టీడీపీ ఎప్పుడో చ‌నిపోయింద‌ని స‌తీష్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. లోకేష్ వార్డు మెంబ‌ర్‌గా కూడా గెల‌వ‌లేడ‌ని, అలాంటి వాడ్ని ప‌ట్టుకుని అడ్డ‌దారిలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేశార‌ని అన్నారు. అలాంటి వ్య‌క్తికి టీడీపీ ప‌గ్గాలు అప్ప‌గించేందుకు చంద్ర‌బాబు చూస్తున్నార‌ని, ఇది స‌రైంది కాద‌ని, లోకేష్‌కు పార్టీ బాధ్య‌త‌లు ఇస్తే.. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో ప‌నిచేసేందుకు ఎవ‌రూ సిద్ధంగా లేర‌ని స‌తీష్ అన్నారు.
లోకేష్‌కు ద‌మ్ముంటే వెంట‌నే ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని కూడా స‌తీష్ అన్నారు. మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై గెలిచిన ఎమ్మెల్యే ఆర్కేతో చ‌ట్ట‌స‌భ‌లో కూర్చోవ‌డానికి లోకేష్‌కు సిగ్గ‌నిపించ‌డం లేదా.. అని స‌తీష్ ప్ర‌శ్నించారు. టీడీపీలో లోకేష్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌ని, ఇక‌పై పార్టీ భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌క‌మే అని కూడా ఆయ‌న అన్నారు.. ఈ క్ర‌మంలో స‌తీష్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు టీడీపీలో దుమారాన్ని రేపుతున్నాయి. మ‌రి దీనిపై చిన‌బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news