మనకు వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ ఒకటి. పాన్ కార్డు వలన చాలా లాభాలున్నాయి. అయితే పాన్ కార్డు కలిగిన వాళ్ళు ఆధార్ ని లింక్ చెయ్యాలి. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. మార్చి 2023లోపు పాన్‌తో ఆధార్‌ని లింక్ చేయలేదంటే మీ పాన్ కార్డ్‌తో ఎలాంటి ఉపయోగం ఉండదు. కనుక తప్పనిసరిగా లింక్ చేసుకోండి.
ఈ గడువు లోగా లింక్ చెయ్యకపోతే లింక్ చేసే అవకాశం మళ్ళీ రాదు. ఆదాయపు పన్ను శాఖ ఇక ఈ తేదీని ఎక్స్టెండ్ చెయ్యరని చెప్పేసింది. 31 మార్చి 2022లోపు పాన్, ఆధార్‌ను లింక్ చెయ్యాలని చెప్పారు. జూలై 1, 2022 నుంచి మార్చి 2023 వరకు మీరు లింక్ చేస్తే వెయ్యి పే చెయ్యాల్సి ఉంది. ఒకవేళ మీరు చేయలేదంటే కార్డు పని చెయ్యదు.
ఆధార్ ని పాన్ తో ఎలా లింక్ చెయ్యాలి..?
మొదట మీరు ఆదాయపు పన్ను వెబ్‌సైట్ ని ఓపెన్ చెయ్యండి.
లింక్ ఆధార్ ఎంపికపై క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్ వంటి వివరాలు ఇవ్వండి.
జరిమానా రుసుము చెల్లించండి.
క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేసేసి… ఆధార్ నంబర్‌ను కూడా ఎంటర్ చెయ్యండి.
OTP వస్తుంది. దాన్ని కూడా ఎంటర్ చెయ్యండి.
ఇప్పుడు లింక్ చేయడం జరుగుతుంది.
కానీ చెల్లని పాన్ ని మాత్రం ఉపయోగించకూడదు. చెల్లని PAN కార్డ్‌ని ఉపయోగించినట్లయితే…. అది సెక్షన్ 272B ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. కనుక అలా చెయ్యద్దు. ఒకవేళ దోషిగా తేలితే రూ. 10,000 జరిమానాను కట్టాల్సి వుంది.