మెంతికూరతో పాన్ కేక్.. షుగర్ పేషెంట్స్ కు బెస్ట్ స్నాక్

-

మెంతిఆకును ఏ వంటలో వాడుకున్నా.. ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు.. మనం డైలీ చెప్పుకుంటూనే ఉంటాం… ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణం.. ఉప్పు వాడకమే అని.. మరి ఉప్పు లేకుండా ఉండాలి అంటే.. మొదట్లో మీ నాలుక ఒప్పుకోదు. టేస్ట్ లేదని తినడానికి సహించదు. మెంతికూర వేసి వండుకుంటే.. ఉప్పులేని లోటును నాలుక గుర్తుపట్టలేదట. ఈరోజు మనం మెంతికూరతో పాన్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. ఇలా మెంతికూరను తింటే.. బాడీకి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. హెల్త్ కు మంచిది కూడా.

మెంతికూర పాన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

మెంతికూర ఒకటిన్నర కప్పు
పెరుగు అరకప్పు
బొంబాయిరవ్వ అరకప్పు
శనగపిండి రెండు టేబుల్ స్పూన్
పుట్నాలపప్పు పొడి ఒక టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్
అల్లంపేస్ట్ ఒక టేబుల్ స్పూన్
మీగడ ఒక టేబుల్ స్పూన్
వంటసోడా ఆఫ్ టీ స్పూన్
జీలకర్ర ఒక టీ స్పూన్
వేపించిన వేరుశనగపప్పుముక్కా చెక్క ఒక టేబుల్ స్పూన్
ఇంగువ పొడి కొద్దిగా
పసుపు కొద్దిగా
కొత్తిమీర కొద్దిగా

తయారు చేసే విధానం

మెంతికూరను క్లీన్ చేసుకుని కట్ చేసుకుని ఒక బౌల్ లో వేసుకుని బొంబాయిరవ్వ, శనగపిండి రెండు టేబుల్ స్పూన్, జీలకర్ర,అల్లం పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, వేపించిన వేరుశనగపప్పు ముక్కాచెక్కా, వంటసోడా, నిమ్మరసం, పెరుగు వేసి బాగా కలపండి. వాటర్ యాడ్ చేయొద్దు. 10-15 నిమిషాలు పెడితే.. పిండి ఉబ్బుతుంది.

ఆ తర్వాత ప్యాన్ తీసుకుని మీగడ వేసి, ఆవాలు, కరివేపాకు వేసి.. మెంతికూరతో తయారు చేసుకుని మిశ్రమం వేసి.. మనకు కావాల్సిన మందంలో వేసి కేక్ లా అద్దుకోండి.. మూత పెట్టి సిమ్ లో కాలనివ్వండి. ఒకవైపు రోస్ట్ అయిన తర్వాత మరోవైపు కూడా కాలనివ్వండి. రెండు వైపులా మీగడ రాసి దోరగా వేయించుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఎదిగే పిల్లలకు ఇలాంటివి పెడితే.. చూడ్డానికి ఆకర్షణీయంగా ఉండటంతో ఇష్టంగా తింటారు. హెల్త్ కు మంచిది. షుగర్ పేషెంట్స్ కు మెంతిఆకు చాలా మంచిది. వాళ్లు కూడా ఇది హ్యాపీగా తినొచ్చు.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news