వర్షాకాలం వచ్చిందంటే చాలు మనకి వాతావరణం చల్లగా హాయిగా ఉంటుందని సంబరపడతాం. కానీ దోమలకు మాత్రం వర్షాకాలం అంటే మహా ఇష్టం. ఎందుకంటే ఈ కాలంలో భారి వర్షాలు, బురద, ఆగిపోయిన నీళ్ళు ఉండడం వల్ల దోమలకు నివాసం దొరుకుతుంది. అక్కడితో ఆగవు కదా మనుషుల రక్తం తాగడానికి బయలుదేరతాయి. ఈ దోమలలో ప్రమాద కరమైన దోమ డెంగ్యూ దోమ ఈ దోమ కుడితే చాలా ప్రమాదం. ఒక్కోసారి మనిషి ప్రాణాలు సైతం పోతాయి. డెంగీ వస్తే విపరీతమైన జ్వరం వస్తుంది. చలి, తీవ్రమైన తల నొప్పి, ఒళ్లునొప్పులు ఉంటాయి. శరీరంపై దద్దుర్లు వస్తాయి. విపరీతమైన దాహం వేస్తుంది.నోరు ఎక్కువగా ఆరిపోతుంది వాంతులు అవుతాయి. కళ్లలో నొప్పి వస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దగ్గరకు వెళ్ళాలి. డెంగీ రావడం వలన శరీరంలో ఫ్లేట్ లెట్స్ తగ్గుతాయి. ఇలా తగ్గడం వలన రక్తం గడ్డకట్టి ఆగిపోతుంది. అందుకే డెంగ్యూ వచ్చినప్పుడు పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉన్న ద్రవాలను రోగికి ఇవ్వాలి.
పరిసరాలను పరిశుభ్రముగ ఉంచుకొని ముఖ్యంగా దోమలు రాకుండా నివారిస్తే ఈ వ్యాధి బారిన పడకుండా ఉంటాం.డెంగ్యూ జ్వరం బారిన పడి వేలమంది హాస్పిటల్స్ లో పడుతుంటారు. అందుకని డెంగ్యూ లక్షణాలు కనపడగానే మీరు చేయాలిసిన మొదట పని బొప్పాయి రసం తాగడం. బొప్పాయి ఆకులు డెంగీ నివారణకు బాగా పని చేస్తాయి. డెంగీ వచ్చిన వారు బొప్పాయి ఆకుల రసం తాగితే ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి. రక్తం వృద్ధి చెందుతుంది. త్వరగా జ్వరం నుంచి కోలుకుంటారు. బొప్పాయి ఆకులు డెంగ్యూ ముదరకుండా అడ్డుకుంటాయి. మంచి వాతావరణంలో పెరిగిన బొప్పాయి చెట్టు నుంచి ఆకులని తీసుకోండి.దుమ్ముధూళి పోయేలా నీటితో శుభ్రం చేయండి. ఆ తరువాత బాగా రుబ్బండి. అది పేస్టులా తయారు చేయాలి ఇప్పుడు రసం వడబోయండి. రసాన్ని కాసేపు ఫ్రిడ్జిలో ఉంచి, ఉప్పు, చక్కర ఏమి కలపకుండా తాగండి.రుచి కాదు మీకు కావాల్సింది, ఆరోగ్యం. ఎనిమిది గంటల గ్యాప్ ఇస్తూ రోజుకి రెండుసార్లు ఈ రసాన్ని 50 మిల్లి లీటర్లు తాగించాలి. అయితే బొప్పాయి ఆకుల రసం వలన కొందరికి వాంతులు అవుతాయి. కానీ కంగారుపడవద్దు.
డెంగ్యూ వచ్చినప్పుడు ప్లేట్లేట్ల సంఖ్య చాలా ముఖ్యం.బొప్పాయిలో ప్లేటిలెట్స్ ని పెంచే గుణం ఉంది.ఈ సంఖ్య తగ్గితే ప్రాణానికి అపాయం. అందుకనే బొప్పాయి రసం తాగాలి. అంతేతప్ప, పూర్తిగా నయం చేయదు. ప్రభావాన్ని తగ్గిస్తుంది, ఎదుగుదలని సాధ్యమైనంతవరకు ఆపుతుంది లేదా నెమ్మదింపజేస్తుంది. కేవలం బొప్పాయి ఆకుల మీద ఆధారపడకూడదు. చికిత్స తీసుకుంటూనే ఈ రసం తాగాలి. వేప ఆకులు డెంగీ జ్వరం తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి డెంగీ ఫీవర్ వైరస్ ను అరికట్టగలవు. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి బాగా పని చేస్తాయి.