బ్రేకింగ్: చైనా నుంచి ఆరు కొండలను స్వాధీనం చేసుకున్న ఆర్మీ…!

-

భారత్ చైనా సరిహద్దుల్లో భారత్ పై ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్న చైనా ఆర్మీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది భారత ఆర్మీ. సరిహద్దుల్లో ఆరు పెద్ద కొండలను భారత ఆర్మీ స్వాధీనం చేసుకుందని ఆర్మీ వర్గాలు మీడియాకు చెప్పాయి. మాగర్ హిల్, గురుంగ్ హిల్, రేజాంగ్ లా రచనాలా, మొఖ్ ఫారీ, ఫింగర్ 4 లో అతి పెద్ద కొండను స్వాధీనం చేసుకున్నారు అని ఆర్మీ వర్గాలు చెప్పాయి.

ఇవి అన్నీ కూడా చైనా వైపు ఉన్నాయని, వాస్తవాధీన రేఖ వద్ద భారత ఆర్మీ పూర్తి పట్టు సాధించింది అని ఆర్మీ వర్గాలు చెప్పాయి. చైనాను ఏ మాత్రం తక్కువ అంచనా వేయలేమని, అందుకే వాస్తవాధీన రేఖ వద్ద భరత్ 3 వేల మంది అదనపు బలగాలను మోహరించింది అని ఆర్మీ అధికారులు వివరించారు. మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటామని ఆర్మీ వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news