అనంతపురం: కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టిడిపి నేత పరిటాల శ్రీరామ్. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అక్రమాలు బయట పెడితే అంతా ఫేక్ అని చెబుతున్నారని.. అక్రమాలు బయటపడినా జనాల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. అక్కడికి వెళ్లి వాస్తవాలు సర్వే చేపించుకోవచ్చు కదా?… ఆక్రమణలో ఉన్న వాటిని వదిలేయవచ్చు కదా? అని నిలదీశారు. నీ పక్కన వాళ్ళు తప్పు చేస్తే నువ్వే చెప్పుతో కొట్టాలని సూచించారు.
లోకేష్ వాకింగ్ గురించి ఎమ్మెల్యే కేతిరెడ్డి మాట్లాడడం కంటే ఆయన గుడ్ మార్నింగ్ లు, వాకింగ్ లపై చాలా మంది మాట్లాడుతున్నారన్నారు. కాసిరెడ్డి నాయన ఆశ్రమాన్ని కామెడీగా మాట్లాడాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. ధర్మవరం ఎమ్మెల్యే కులాల మధ్య చిచ్చు పెట్టి ఓ వర్గానికి నన్ను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు శ్రీరామ్. ఎమ్మెల్యే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని.. పదే పదే లోకేష్ గురించి మాట్లాడుతున్నావ్ అని హెచ్చరించారు. కేతిరెడ్డి తనతో పోల్చుకోవడం తగ్గించుకోవాలని, తనపై చెడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అది నీకు మంచిది కాదని హెచ్చరించారు. తనకు ఆల్ ది బెస్ట్ చెప్పిన కేతిరెడ్డి కి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు శ్రీరామ్.