మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత… నిత్యవసర వస్తువులతో… పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే సామాన్య ప్రజలు ఎక్కువగా వాడే వంటగ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎన్నడూ లేని విధంగా ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్య ప్రజల చుక్కలు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరో పిడుగు లాంటి వార్త సామాన్య ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
ప్రముఖ బిస్కెట్ తయారీ కంపెనీ పార్లే ప్రొడక్ట్స్… రెండోసారి తమ బిస్కెట్ల ధరలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే బిస్కెట్లు సహా దాని ఉత్పత్తులపై పెంచనున్నట్లు పార్లర్ ప్రకటన చేసింది. నాలుగో త్రైమాసికంలో బిస్కెట్లు ధరలు 10 నుంచి 20 శాతం పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 10 నుంచి 15 శాతం ధరలు పెంచింది పార్లే.
దేశంలో నూనె అలాగే మైదా, పంచదార ధరలు పెరగడంతో మరోసారి ధరల పెంచనున్నట్లు ప్రకటన చేసింది పార్లే కంపెనీ. పార్లే కంపెనీ తాజా నిర్ణయం ప్రకారం… ధరలు పెరిగాయి కానీ ఒకటి మాత్రం తగ్గుతుంది. అంటే పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ధర అలాగే ఉంటుంది. కానీ క్వాంటిటీ మాత్రం కాస్త తగ్గుతుంది.