ప్రధాని మోదీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక భేటీ…

ప్రధాని నరేంద్ర మోదీతో … బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈరోజు భేటీ కానున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తరువాత మొదటి సారిగా మమతా బెనర్జీ తొలిసారిగా ఢిల్లీకి వచ్చారు. ఈనెల 29 నుంచి పార్లమెంట్ శీతాాకాల సమావేశాలకు ముందు దీదీ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, బీఎస్ఎఫ్ పరిధి పెంపు అంశంతో పాటు, బెంగాల్ అభివ్రుద్దిపై ప్రధాని నరేంద్ర మోదీతో మమతా బెనర్జీ చర్చించే అవకాశం ఉంది. ఇటీవల బెంగాల్లో బీఎస్ఎఫ్ జ్యూరిడిక్షన్ పెంపు అంశంపై టీఎంసీ పార్టీ గుర్రుగా ఉంది. పంజాబ్, అస్సాం, పశ్చిమబెంగాల్ లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి  15 కిలోమీటర్లుగా ఉన్న బీఎస్ఎఫ్ పరిధిని 50 కిలోమీటర్లకు పెంచుతూ  కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎవరి అనుమతులు లేకుండా బీఎస్ఎఫ్ చర్యలు తీసుకోవచ్చు. శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశమని, బంగ్లాదేశ్‌తో పశ్చిమ బెంగాల్ సరిహద్దులు పూర్తిగా శాంతియుతంగా ఉన్నాయని మమతా బెనర్జీ ఇటీవల చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రధాని మోదీ భేటీలో ఈ అంశమే ప్రధానంగా చర్చలకు వచ్చే అవకాశం ఉంది.