ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ… సహాయం చేయాలని కోరిన సీఎం.

భారీ వర్షాలు వరదల ధాటికి రాయలసీయ అతలాకుతలం అయింది. ముఖ్యంగా చిత్తుర్, నెల్లూర్, అనంతపురం, కడప జిల్లాల్లో వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. దీంతో ఈ నాలుగు జిల్లాల్లో రోడ్లు, విద్యుత్ లైన్లు, చెరువులు, ప్రాజెక్ట్ లు, పలు గ్రామాల్లో ప్రజల ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అల్పపీడనం కారణంగా నాలుగు జిల్లాల్లో భారీగా నష్టం వాటిల్లింది. ఇప్పటికే వరదల పరిస్థితిని ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి వివరించారు.

తాజాగా వరద నష్టం నుంచి కోలుకునేందుకు సహాయం చేయాలని ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో 6.54 వేల కోట్ల నష్టం వాటిల్లిందని లేఖలో జగన్ పేర్కొన్నారు. ప్రధాని తో పాటు అమిత్ షాకు కూడా లేఖ రాశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. వరద నష్టంపై తక్షణ సహాయం కోసం రూ. 1000కోట్లు విడుదల చేయాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో వరద నష్టంపై అంచానా వేసేందుకు సెంట్రల్ టీములను పంపాలని ప్రధానిని కోరారు సీఎం జగన్.