‘కాళేశ్వరం’ జాతీయహోదా కోసం ప్రతిపాదన రాలేదు : కేంద్రం

-

కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదాపై పార్లమెంటులో చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ప్రతిపాదనలు అందలేదని కేంద్ర జల్‌శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లోక్‌సభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

మూసీ కాలుష్య ప్రక్షాళనకు సంబంధించి జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక పథకం (ఎన్‌ఆర్‌సీపీ) కింద 2014 తర్వాత ఎలాంటి ప్రాజెక్టు చేపట్టలేదని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదన కూడా ఏమీ లేదని కేంద్ర మంత్రి తెలిపారు. ఎంపీలు బొర్లకుంట వెంకటేష్‌ నేత, మాలోత్‌ కవిత అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు.

తెలంగాణలోని సూక్ష్మ, చిన్నమధ్యతరహా పరిశ్రమలకు 2023 మార్చి 1 నాటికి రూ.110.46 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భానుప్రతాప్‌ సింగ్‌ వర్మ తెలిపారు. ఎంపీ రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పట్టణ) కింద ఇప్పటి వరకు తెలంగాణకు 2,49,465 ఇళ్లు మంజూరు చేయగా 2,43,727 ప్రారంభించి 2,22,378 పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్‌ కిషోర్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news