BREAKING : కరోనా పుట్టిల్లు వుహాన్‌లో మళ్లీ లాక్‌డౌన్‌

-

యావత్‌ ప్రపంచాన్ని భయపెట్టి.. సంక్షోభంలోకి నెట్టి.. లక్షల మంది జీవితాలను అతలాకుతలం చేసిన  కొవిడ్‌-19 మొదటిసారిగా చైనాలోని వుహాన్‌లో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. మూలాలపై ఇప్పటికీ క్లారిటీ లేకపోయినా వుహాన్‌లోనే కొవిడ్‌ ఉద్భవించిందని ప్రపంచ దేశాలు నమ్మాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి దాదాపు అంతమైనట్టే అని భావిస్తున్న తరుణంలో ఓ వార్త మళ్లీ కలవరపెడుతోంది.

కరోనా పుట్టినల్లైన వుహాన్‌లోని పలు జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ విధించారు. వుహాన్‌లోని హన్‌యాంగ్‌ జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 18 కరోనా కేసులు బయటపడ్డాయి. అప్రమత్తమైన అధికారులు అత్యవసరం మినహా మిగతా కార్యకలాపాలన్నింటినీ మూసివేయాలని నిర్ణయించారు. కేవలం సూపర్‌ మార్కెట్లు, ఫార్మసీలను మాత్రమే తెరిచేందుకు అనుమతిచ్చారు. ఈ లాక్‌డౌన్‌ నిబంధనలు వచ్చే ఆదివారం వరకూ ఉంటాయని.. పరిస్థితులను బట్టి తదుపరి కొనసాగింపు ఉంటుందని చెప్పారు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేస్తూనే దానితో కలిసి జీవించే విధానాన్ని ప్రపంచ దేశాలు అవలంబిస్తుండగా.. చైనా మాత్రం జీరో-కొవిడ్‌ వ్యూహాన్ని పాటిస్తోంది. ఒక్క కేసు వచ్చినా లక్షల సంఖ్యలో పరీక్షలు, క్వారంటైన్‌ నిబంధనలు విధిస్తోంది. కఠిన నిబంధనలపై స్వదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తున్నా జిన్‌పింగ్‌ మాత్రం తమ విధానాన్ని సమర్థించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news