పార్టీలో కొత్త వారికే ఛాన్స్..సమావేశంలో తేల్చేసిన షర్మిల !

Join Our Community
follow manalokam on social media

కొత్త పార్టీ నిర్మాణం కార్యాచరణపై ముఖ్య నాయకులతో షర్మిల ఈరోజు సమావేశం అయ్యారు. ఆ సమావేశం కొద్ది సేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో హైదరాబాదులో పార్టీకి కొత్తగా కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ నెల 20వ తేదీన ఖమ్మం జిల్లా అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలానే పార్టీలోకి కేవలం కొత్త వారినే తీసుకోవాలని సూచన ప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇక ఈరోజు షర్మిల భర్త బ్రదర్ అనిల్ పుట్టిన రోజు కావడంతో ఆయన వారి ముందే కేక్ కట్ చేశారు. ఇక షర్మిల పార్టీ పెట్టడం దాదాపుగా ఖరారు అయిపోయినట్టే. ఇక ఇప్పటికే టీఆర్ఎస్ సహా అన్ని పార్టీల వారు షర్మిల మీద ఎటాక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే అన్ని పార్టీల నేతలు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఎందాకా వెళుతుందో ? చూడాల్సి ఉంది.

TOP STORIES

ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్డ్ ఫ్రీ….రూ.5 లక్షల ఇన్స్యూరెన్స్ ని ఎలా పొందాలంటే…?

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన నుండి ప్రయోజనంకల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఎవరైనా ఆయుష్మాన్...