వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిజెపి నేతలు జైశ్రీరామ్ అంటూ ఉన్మాదులను తయారు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మతాలు, కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని.. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు అమలు చేయడం చేతగాని బిజెపి నేతలు.. మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పసునూరి దయాకర్. బండి సంజయ్ ఇలాంటి రాజకీయాలు మానుకోవాలని అన్నారు. ఆలయాలలో ప్రమాణాలు చేయడం ఏంటని.. ఇలాంటివి ఏ చట్టంలో ఉన్నాయో చెప్పాలని నిలదీశారు.