పేర్నినాని బ్లాక్ టిక్కెట్ల మంత్రి..బైపాస్ రోడ్డుకు రింగ్ రోడ్డుకు తేడా తెలియదు : పట్టాభి

-

TDP అధికార ప్రతినిధి పట్టాభి మరోసారి కామెంట్స్ చేశారు. మంత్రి పేర్నినాని బ్లాక్ టిక్కెట్ మంత్రి అని.. బెంజ్,బెట్టింగ్ మంత్రులతో పాటు ఇప్పుడు బ్లాక్ టిక్కెట్ మంత్రి వచ్చాడని ఫైర్ అయ్యారు. పేర్నినానికి బైపాస్ రోడ్డుకి ఔటర్ రింగ్ రోడ్డుకి తేడా తెలియదని చురకలు అంటించారు. విషయ పరిజ్ఞానం లేకుండా తాడేపల్లి ప్యాలెస్ లో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే ఎలా…? అని ప్రశ్నించారు. మీరు నిశానీ బ్యాచ్ అని అందరికీ తెలుసని మండిపడ్డారు.

Pattabhi
Pattabhi

ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు తర్వాతే హైదరాబాద్ భౌగోళిక స్వరూపం మారిపోయింది…నగరం విస్తరణ, అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్డు అవసరమని పేర్కొన్నారు. అమరావతి రాజధాని, దాని చుట్టూ వున్న విజయవాడ,గుంటూరును కలుపుతూ 189కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు రూపకల్పన జరిగిందని వెల్లడించారు. 17761కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి కేంద్రం ఆమోదించింది.. అటువంటి ప్రాజెక్ట్ ను వైసీపీ ప్రభుత్వం అటకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఓ.ఆర్.ఆర్.ను మంగళం పడేశారని కేంద్ర మంత్రి నీతిని గడ్కరీనే చెప్పారని వెల్లడించారు. ఫీజబులిటీ నివేదిక కూడా సిద్ధం చేశారు…రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే నిర్మాణానికి సిద్ధమని కేంద్రం చెప్పిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం మాత్రం 78కి.మీ విజయవాడ బైపాస్ ఇస్తే సరిపోతుందని చెప్పారన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news