జైలు నుంచి విడుదలైన అనంతరం మరోసారి జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు టిడిపి జాతీయ ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం. రెండేళ్లలో పెట్రోల్, డీజిల్ పై పన్నుల రూపంలో ప్రజల నుంచి జగన్ సర్కార్ ఏకంగా 29 వేల కోట్లు వసూలు చేసిందని ఫైరయ్యారు. ప్రతి నెల 1000 కోట్ల వరకు ఈ వసూళ్లు జరుగుతున్నాయని నిప్పులు చెరిగారు. మంగళగిరి టిడిపి కార్యాలయంలో… నిర్వహించిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు.
భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ గా ఉన్నాయని.. ఈ విషయాన్ని జులై 26వ తేదీన పార్లమెంట్లో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు పట్టాభి. వాస్తవాలు కప్పిపుచ్చే లా నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. ఉన్న పనులపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రెండు రూపాయల తగ్గిస్తే… ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ పనులు పెంచుతూ జీవో ఇచ్చింది అని మండిపడ్డారు. బాధ్యత కలిగిన పసుపు సైనికుడి రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలను తాను ఆధారాలతో బయట పెట్టానని గుర్తు చేశారు.