ఎట్టేట్టా…అట్టాగా.. ఎం చెప్పావు సారు?

-

తెలంగాణలో జనసేన పార్టీ ఎవరికి మద్దతివ్వాలనే దానిపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేడు ట్విట్టర్ వేదికగా స్పందించారు.ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోని పోస్ట్ చేశారు…ఇందులో… ముందస్తు ఎన్నికలు వచ్చినందున సమయం లేక తెలంగాణలో జనసేన పోటీ చేయలేకపోయిందన్నారు. తెలంగాణను ఇచ్చామని ఒకరు, తెలంగాణను తెచ్చామని మరొకరు విరుద్ధ ప్రకటనలు చేస్తున్న దశలో ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఈ సమయంలో ఎవరికి ఓటేయాలన్న దానిపై ప్రజలు మాత్రమే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎవరైతే ఎక్కువ పారదర్శకతతో, తక్కువ అవినీతితో మంచి పరిపాలన అందించగలరో వారికే ఓటేసి తెలంగాణలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పవన్ తెలంగాణలో తెరాస-భాజపా రహస్య కూటమికి లోపాయికారీ మద్దతిస్తున్నారని తెదేపా నేతలు కొద్దిరోజులు నుంచి ఆరోపిస్తున్నారు.

అయితే వీటన్నింటికి సమాధానం చెబుతూ..నేడు ట్విట్ చేశారు. వీడియో మొత్తం చూసిన అభిమానులు, ఇతరులు పవన్ అసలు ఏం చెప్పాడో అనే విషయంపై చర్చించుకుంటున్నారు.అన్నింటికంటే ముఖ్యంగా… అవినీతి తక్కువగా చేసే పార్టీకే ఓటేయాలని పిలుపునివ్వడం గమనార్హం. పవన్ అవినీతిని ప్రోత్సహించే విధంగా అవినీతి తక్కువ…ఎక్కువ ఉన్న పార్టీలకు ఓటేయమని సూచించడం చాలా విడ్డూరంగా ఉందంటూ…సర్వత్రా చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news