కాపులకు 5% రిజర్వేషన్లు కల్పించే విషయంలో డిసెంబర్ 31వ తేదీలోపు స్పష్టత ఇవ్వాలని ఇటీవల ఏపీ ప్రభుత్వానికి మాజీ ఎంపీ చేగుండి హరి రామ జోగయ్య అల్టిమేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ గడువు ముగిసిన నేపథ్యంలో హరి రామ జోగయ్య నిన్న రాత్రి నుంచి దీక్షలో ఉన్నట్లు ప్రకటించారు. దీంతో పాలకొల్లులో జోగయ్యను అదుపులోకి తీసుకుని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేసే వరకు తన దీక్ష కొనసాగిస్తానని హరి రామ జోగయ్య ప్రకటించారు.
జీవో నెంబర్ 60 రద్దు చేయాలని.. ఆక్ట్ 14, 15 అమలులోకి తీసుకురావాలంటున్నారు. ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తన దీక్ష కొనసాగిస్తున్నారు హరిరామ జోగయ్య. ఆయన చేస్తున్న ఆమరణ దీక్షపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 85 సంవత్సరాలు వయసున్న జోగయ్య ఆరోగ్యం పై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.