మహేష్ వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్..!

-

మహేష్ బాబు పేరిట ఉన్న ప్రపంచ రికార్డ్‌ ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బ్రేక్ చేసారు. మహేష్ బర్త్‌ డే సందర్బంగా అభిమానులు ఆయన బర్త్‌ డే ట్యాగ్‌ను 24 గంటల్లో 60.2 మిలియన్ ట్వీట్స్‌ తో ప్రపంచ రికార్డుకెక్కితే.. పవన్ కళ్యాణ్ బర్త్‌ డే సీడీపీతో ఆయన అభిమానులు 24 గంటల్లో 65 మిలియన్ల ట్వీట్స్ చేసి ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్‌ ను నమోదు చేశారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్‌ డే కాగా ఇన్ని రోజుల ముందే రికార్డు క్రియేట్ చేసారు.

ట్రెండింగ్‌లో భాగంగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించి రకరకాల ఫోటోలను ట్వీట్ చేశారు ఫ్యాన్స్. ఈ పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది పవన్ బర్త్ రోజు మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేయడం పక్కా అని తెలుస్తుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శత్వంలో రూపొందుతున్న వకీల్ సాబ్ మూవీ చేస్తున్నారు. దీని తర్వాత క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news