ఎన్టీఆర్ రికార్డును బద్దలుకొట్టిన పవర్ స్టార్..!

-

టాలీవుడ్ పవర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరిట తాజాగా సోష‌ల్ మీడియాలో స‌రికొత్త రికార్డ్ న‌మోదైంది. పవన్ పుట్టినరోజుకు 50 రోజులున్న నేపథ్యంలో అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేసి ట్విట్టర్‌లో ట్రెండ్ చేసారు ఫాన్స్. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ 12 మిలియన్ ట్వీట్స్‌ తో ఇంతకుముందే ఒక రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ రికార్డును అధిగమించాలని, అది కూడా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కంటే ముందు పూర్తవ్వాలనే లక్ష్యంతో ఫ్యాన్స్ ట్వీట్స్ చేశారు. అంతేకాదు కాస్త ఇంట్రెస్టింగ్‌గా ఉండేందుకు వీడియోలను కూడా పోస్టు చేశారు.

Pawan-Kalyan

దీంతో 24 గంటల వ్యవధిలో ఏకంగా 27.3 మిలియన్ ట్వీట్లతో పాత రికార్డును బద్దలు కొట్టి కొత్త రికార్డును నెలకొల్పారు. ఇప్పుడు ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో హైదరాబాదుకే పరిమితమైన పవన్.. అంతకుముందు షూటింగ్‌లలో పాల్గొన్నారు. ఇక లాక్‌డౌన్ తర్వాత హైదరాబాదుకే పరిమితమైన జనసేనాని ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడేందుకు ట్విటర్‌ను వేదికగా చేసుకున్నారు. ట్విటర్ వేదికగా పలు విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news