పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా అభిమానులు అనేక కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఓ మహిళా అభిమాని చేతులు లేకపోయిన నోటితో పవన్ ఆర్ట్ వేసి తన అభిమానాన్ని తెలిపింది. ఈ ఆర్ట్ కి ఫిదా అయిన పవన్ ‘మా బంగారు తల్లి స్వప్న, నువ్వు వేసిన డ్రాయింగ్ నా దృష్టికి జనసైనికులు తీసుకొచ్చారు, చాలా చక్కగా ఉంది తల్లి. నేను వైజాగ్ వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను. జాగ్రత్త అమ్మ’ అని ట్వీట్‌లో తెలిపారు. అలాగే బంధువులు, సన్నిహితులు, సినీ తారలు, అభిమానులు, జనసైనికులు అభిమానంతో శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు.
వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలను పవన్ కల్యాణ్ తెలిపారు. వీరి ప్రేమాభిమానాలు మరింత బాధ్యతను పెంచాయని పేర్కొన్నారు. అదేవిధంగా కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన శ్రీ రామ్ చరణ్‌కి అలాగే పెద్ద మనుసుతో ముందుకు వచ్చిన శ్రీ అల్లు అర్జున్, నిర్మాతలు శ్రీ దిల్ రాజు, శ్రీ ఏ.ఎమ్ రత్నం, మైత్రి మూవీస్ శ్రీ నవీన్ గార్లకు నా కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేశారు.
మా బంగారు తల్లి స్వప్నకి , నువ్వు వేసిన నా డ్రాయింగ్
నా దృష్టికి మన జనసైనికులు తీసుకొచ్చారు, చాల చక్కగా ఉంది తల్లి.. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను. జాగ్రత్త అమ్మ! pic.twitter.com/i3RrOxGR1U— Pawan Kalyan (@PawanKalyan) September 3, 2020