పవన్ కళ్యాణ్ క్లారిటీ లేని వ్యక్తి – మంత్రి ఉషశ్రీ చరణ్

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి ఉషశ్రీ చరణ్. ఈరోజు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ క్లారిటీ లేని వ్యక్తి అని.. ఆయన స్టాండ్ ఏంటో ఆయనకే తెలియడం లేదని ఎద్దేవా చేశారు. పవన్ కి క్లారిటీ ఉంటే ఢిల్లీ పర్యటనలో క్లారిటీ వస్తుందని అన్నారు.

మా నమ్మకం నువ్వే జగనన్న స్టికర్ కింద జనసేన కార్యకర్తలు వారి స్టిక్కర్ వేయడం రాజకీయ దురుద్దేశమేనని మండిపడ్డారు. నవరత్నాలు, సంక్షేమ పథకాల పేరుతో జగన్ పాదయాత్ర చేశారని.. నారా లోకేష్ పాదయాత్రలో ఎమ్మెల్యేలపై విమర్శలు తప్ప.. అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తామో చెప్పడం లేదని విమర్శించారు. మళ్లీ జగన్ దే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు ఉషాశ్రీ చరణ్.

Read more RELATED
Recommended to you

Latest news