పొత్తులు ఎలా ఉండోబోతోన్నాయనేది తరువాత తెలియజేస్తా : పవన్‌

-

పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జరిగే ఏన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన పొత్తులపై స్పందించారు. ఏపీలో పొత్తులపై సమయం వచ్చినప్పుడు చెబుతానన్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా కలిసేదేమీ లేదని తెలిపారు. ఎన్డీఏ సమావేశంలో ఏపీ ఎన్నికలపై కూడా చర్చకు అవకాశం ఉందని పవన్ తెలిపారు.

Pawan Tour-Target Anju Yadav in Srikalahasti-Tension, Tension.. | target  women ci Anju Yadav, Pawan Kalyan begins tour in Srikalahasti

మరోవైపు ఏపీ, తెలంగాణ‌లో భవిష్యత్తు, పార్టీ మధ్య ఐక్యత, జనసేన పాత్రపై కూడా ఆ సమావేశంలో చర్చ జరగొచ్చని పేర్కొన్నారు. ఎన్డీఏ పాలసీలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపైనా భాగస్వామ్య పక్షాలకు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తిరుపతి నుంచి ఢిల్లీ చేరుకున్న పవన్ కల్యాణ్ ఈ రాత్రికి అక్కడే బస చేసి మంగళవారం జరిగే ఎన్డీఏ సమావేశానికి హాజరవుతారు. చాలా కాలంగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తోన్నానని, అన్ని అంశాలపైనా మాట్లాడతానని పేర్కొన్నారు. ఎన్డీఏ సమావేశానికి హాజరు కావాలంటూ పార్టీ సీనియర్‌ నేతలు తమను ఆహ్వానించారని పేర్కొన్నారు. ఎన్డీఏ విధానాలు ఎలా ఉంటాయనేది తెలుసుకోబోతోన్నామని, వాటి కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news