మహిళా లోకానికి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి – విడదల రజిని

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మూడు పెళ్లిళ్లకు సంబంధించి ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది మహిళా కమిషన్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని.. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పేర్కొంది.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు పంపించడం పై జనసేన పార్టీ స్పందించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విజయవాడ నగరంలో 23 ఏళ్ల దళిత యువతపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు మహిళా కమిషన్ ఎక్కడ? ఏం చేస్తుందని ప్రశ్నించింది. దుగ్గిరాల మండలం తుమ్మపూడి లో 32 ఏళ్ల మహిళా ఇంట్లో అనుమానాస్పదంగా హత్యకు గురైంది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? అని ప్రశ్నలు వేసింది.

అయితే విశాఖ ఎయిర్పోర్టులో జరిగిన ఘటనకు క్షమాపణ చెప్పాల్సింది పోయి.. మహిళలను కించపరిచేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మంత్రి విడుదల రజిని అన్నారు. భారత వివాహ వ్యవస్థను అగౌరవపరిచేలా పవన్ మాట్లాడడం బాధాకరమని వ్యాఖ్యానించారు. పవన్ కి మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం సమంజసమేనని.. వెంటనే పవన్ కళ్యాణ్ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news