ఈనెల 8వ తేదీన కర్నూలు జిల్లాకు పవన్ కళ్యాణ్

-

ఈనెల 8వ తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల్లో భరోసా కల్పించేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నట్లు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.ఈ సందర్భంగా సిరివెళ్ల మండల కేంద్రంలోని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. తొలి విడత ఉమ్మడి కర్నూలు జిల్లాలో 130 మంది కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేయనున్నట్లు తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి రూ. లక్ష రూపాయల చొప్పున అందిస్తారు.ఈ సందర్బంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు చౌకబారు విమర్శలు మానుకోవాలని, రైతులకు సాయం అందించే పని పై దృష్టి పెట్టాలి అని, రైతు భరోసా యాత్ర రైతులకు కొండంత నమ్మకాన్ని కలిగిస్తున్న విషయాన్ని గ్రహించి వైసీపీ నేతలు ఇలాంటి చౌకబారు విమర్శలకు దిగుతున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news