సీఎం జగన్ కు షాక్ : పవన్ కళ్యాణ్ సంచలన ట్వీట్ !

-

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ మూవీ ఈవెంట్ లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… వైసిపి సర్కార్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ టికెట్ విధానాన్ని వైసీపీ సర్కార్ తీసుకురావడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు అదే స్థాయిలో వైసీపీ మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

jagan pawawn kalyan

వరుసగా ప్రెస్మీట్లు పెట్టి… పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు ఏపీ మంత్రులు. ఇది ఇలా ఉండగా తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై మరో సంచలన ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. వైసిపి ఏపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు చేయలేదంటూ… ఫైర్ అయ్యారు. మద్యపాన నిషేధం, కరెంటు చార్జీలు, ఉద్యోగాల భర్తీ, , రాజధాని అంశం ఇలా ఎన్నో వాగ్దానాలు ఇచ్చిందని పేర్కొన్న పవన్ కళ్యాణ్… వాటిలో ఏ ఒక్క వాగ్దానాలను వైసీపీ సర్కార్ నెరవేర్చడంలో విఫలం అయిందని ఫైర్ అయ్యారు. అంతేకాదు… వాగ్దానాలు నెరవేర్చక పోగా… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మండిపడ్డారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news