అహంకారం తీస్తాం.. తోలు తీసి కింద కూర్చోబెడతాం మీకు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. MPDO జవహర్ బాబును పరామర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపిడిఓ జవహర్ బాబును పరామర్శించి, అండగా ఉంటానని వారి కుటుంబానికి ధైర్యం చెప్పిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాన్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అధికారులపై దాడి చేస్తే వదిలేది లేదని… వైసిపి నేతల కళ్ళు నెత్తిన పెట్టుకోని ఉన్నారు కిందకి దించుతానంటూ హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎంపిడివో పై దాడి చేసిన 12 మంది వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి అనుచరులకు వార్నింగ్ ఇచ్చారు.
అధికారుల పై దాడులు గత ప్రభుత్వం లాగా వదిలేది లేదన్నారు. సుదర్శన్ రెడ్డి దాడులు చేయడం కొత్తేమీ కాదు… గతంలో శేఖర్ నాయక్, ప్రతాప్, శ్రీనివాస్ రెడ్డిపై దాడి చేశారని ఆగ్రహించారు. అహంకారంతో, ఇష్టారాజ్యంగా ఉంటామంటే మా ప్రభుత్వం ఊరుకోదన్నారు పవన్ కళ్యాణ్.
అహంకారం తీస్తాం.. తోలు తీసి కింద కూర్చోబెడతాం మీకు -డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/jmoIi2veTP
— ChotaNews (@ChotaNewsTelugu) December 28, 2024