బాలయ్య-పవన్ కల్యాణ్…ఈ కాంబినేషన్ సెట్ అయితే మామూలుగా ఉండదని చెప్పొచ్చు..పూర్తిగా ఇది క్రేజీ కాంబినేషన్…అయితే సినీ ఫీల్డ్‌లో ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి…రాజకీయ రంగంలో ఈ కాంబినేషన్ పరోక్షంగా సెట్ అయ్యేలా ఉంది. రాజకీయంగా ఈ ఇద్దరు వేరు వేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ జనసేన అధినేతగా ఉండగా…బాలయ్య టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు.
అయితే రాజకీయంగా వీరు ఒకే వేదికపైకి వచ్చిన సందర్భాలు లేవు..కాకపోతే రాజకీయంగా పరోక్షంగా సపోర్ట్ ఇచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి..2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్…టీడీపీకి సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే..అప్పుడు బాలయ్య హిందూపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కాకపోతే జనసేనకు హిందూపురంలో బలం లేని విషయం తెలిసిందే. కానీ అప్పుడు బాలయ్యకు పరోక్షంగా జనసేన సపోర్ట్ ఉందని చెప్పొచ్చు. పవన్ సపోర్ట్ ఉపయోగపడకపోయిన బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో పవన్ విడిగా పోటీ చేశారు.
అటు బాలయ్య హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు…అయితే రెండుసార్లు పవన్ ప్రభావం బాలయ్యపై పడలేదు. కానీ ఇటీవల మాత్రం ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది…బాలయ్యకు అనూహ్యంగా పవన్ పార్టీ మద్ధతు దొరికింది. ఇటీవల జగన్ ప్రభుత్వం జిల్లాల విభజన చేసిన విషయం తెలిసిందే…ఈ క్రమంలోనే హిందూపురం పార్లమెంట్‌ని సెపరేట్ జిల్లా చేశారు..కానీ ఆ జిల్లాకు కేంద్రంగా పుట్టపర్తిని పెట్టారు.
ఇక్కడే అసలు సమస్య వచ్చింది..హిందూపురం జిల్లాకు హిందూపురంనే కేంద్రంగా పెట్టాలని హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య దీక్ష చేశారు..అలాగే దీనికోసం ఇతర పార్టీలతో కలిసి పోరాడుతున్నారు…అవసరమైతే జిల్లా కోసం జగన్‌ని కలుస్తానని, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని అన్నారు. ఇదే సమయంలో జిల్లా కోసం పోరాడుతున్న బాలయ్యకు జనసేన సపోర్ట్ ఇచ్చింది. బాలయ్య నాయకత్వంలో జిల్లా కోసం పోరాడతామని జనసేన నేతలు చెబుతున్నారు. అంటే పరోక్షంగా బాలయ్యకు పవన్ సపోర్ట్ దొరికినట్లే అని చెప్పొచ్చు. మరి పవన్ వల్ల బాలయ్యకు రాజకీయంగా ఏమన్నా ప్లస్ అవుతుందేమో చూడాలి.