ట్రెండ్ ఇన్: అదిరిపోనున్న ‘అంటే సుందరానికీ’ ఈవెంట్‌..పవన్ కల్యాణ్ స్పీచ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల పొలిటికల్ మీటింగ్స్‌లో ఫుల్ బిజీగా గడిపేశారు. త్వరలో ఆయన సినిమా ఫంక్షన్ కు హాజరు కానున్నారు. నేచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఆయన హాజరవుతారని మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చేశారు. దాంతో సినీ లవర్స్, పవన్ కల్యాణ్ అశేష అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నామని నెటిజన్లు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే #PawanKalyan హ్యాష్ ట్యాగ్ పవన్ కల్యాణ్ అంటూ ఆయన పేరిట వరుస ట్వీట్లు చేస్తున్నారు. దాంతో సదరు హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. పవన్ కల్యాణ్, నాని ఫొటోలను షేర్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ‘నాని విత్ జనసేనాని’ అని క్యాప్షన్ ఇస్తూ అలా రకరకాల ఫొటోలు షేర్ చేస్తున్నారు నెటిజన్లు.

గతంలో ఏపీలో సినిమా టికెట్ల విషయమై నేచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే ఇప్పుడు వారిరువురు నేచురల్ స్టార్ నాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకే వేదికపైన కలవబోతుండటం ఆసక్తికరంగా మారింది.

మైత్రీ మూవీ మేకర్స్ ‘అంటే సుందరానికీ’ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశారు. వీరి ప్రొడక్షన్ హౌజ్ లోనే పవన్ కల్యాణ్ తన నెక్స్ట్ ఫిల్మ్ ‘భవదీయుడు భగత్ సింగ్’ చేయనున్నారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ ఈ సినిమా చేస్తున్నారు.

పవర్ స్టార్ ‘అంటే సుందరానికీ’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తుండటం పట్ల అభిమానులతో పాటు తాము ఎగ్జైటెడ్ గా ఉన్నామని నేచురల్ స్టార్ నాని, ‘అంటే సుందరానికీ’ మూవీ యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ఈ నెల 10న నాని సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ రాకతో సినిమాపైన అంచనాలు ఇంకా పెరుగుతాయని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news