ఫ్యాక్ట్ చెక్: లక్కీ విన్నర్స్ కి టాటా సఫారీ కారు బహుమతిగా ఇవ్వడంలో నిజమెంత..?

టాటా మోటార్ కార్స్ తమ సేల్స్ 30 మిలియన్లకు పెరిగాయని లక్కీ విన్నర్స్ కి టాటా సఫారీ కార్ బహుమతిగా పొందొచ్చు అని వాట్సాప్ లో ప్రచారం సాగుతోంది. అయితే వాట్సాప్ లో ఫార్వర్డ్ అయ్యే ఈ లింక్ టాటా మోటార్స్ కి మెయిన్ పేజ్ కి మరియు లోగో కి ఎటువంటి లింక్ లేదు.

అయితే నిజంగా ఈ టాటా మోటార్ కార్స్ లక్కీ విన్నర్ కి బహుమతి ఇస్తుందా లేదా అనేది ఇప్పుడు చూస్తే…. దీనిలో ఏ మాత్రం నిజం లేనట్లు తెలుస్తోంది. అక్కడ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పినా ఎటువంటి గిఫ్ట్ బాక్స్ రాదని తెలుస్తోంది.

వాట్సాప్ లో వైరల్ గా మారిన ఈ న్యూస్ కేవలం ఫేక్ అని దీనిలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. వెబ్ పేజ్ నుండి ఐపి అడ్రస్ వరకు దీనిలో ఏ మాత్రం నిజం లేనట్లు మనకి తెలుస్తోంది.

టాటా మోటార్స్ ఇటువంటి అనౌన్స్మెంట్ ఏమి చేయలేదు అని కూడా దీని ద్వారా మనకి అర్థమవుతోంది. సోషల్ ప్లాట్ఫామ్ లో ఈ ఆర్గనైజేషన్ ఎటువంటి ప్రచారం చేయలేదని ఇటువంటి ఫేక్ మెసేజ్లు ఎవరు ఫార్వర్డ్ చేయకుండా ఉండటమే మంచిది.