ఒకప్పుడు జగనన్న బాణం.. ఇప్పుడు బీజేపీ బాణం : పెద్ది సుదర్శన్‌ రెడ్డి

మరోసారి వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిలపై విమర్శలు గుప్పించారు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి. షర్మిల నోరు అదుపులో పెట్టుకోకపోతే తాము ఆంధ్రలో అడుగుపెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు పెద్ది సుదర్శన్‌ రెడ్డి. షర్మిల పాదయాత్ర కొనసాగించడం అనేది ఆమె మాటతీరుపై ఆధారపడి ఉంటుందని పెద్ది సుదర్శన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఒకప్పుడు జగనన్న బాణం అంటున్నారని, ఇప్పుడు బీజేపీ బాణం అంటున్నారని సుదర్శన్ రెడ్డి వ్యంగ్యం ప్రదర్శించారు పెద్ది సుదర్శన్‌ రెడ్డి. పులివెందులలో ఓటేసిన షర్మిల తెలంగాణ బిడ్డ ఎలా అవుతుందని ప్రశ్నించారు. జగన్ ఆంధ్ర బిడ్డ అయితే… షర్మిల తెలంగాణ బిడ్డ అవుతుందా? అని పెద్ది సుదర్శన్‌ రెడ్డి అన్నారు. ఈ మేరకు షర్మిలకు సుదర్శన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

MLA Peddi Sudarshan Reddy: షర్మిల పాదయాత్రలో జరిగిన ఘటనపై స్పందించిన  నర్సంపేట ఎమ్మెల్యే...

తెలంగాణ రాష్ట్రం వచ్చి తొమ్మిదేండ్లు అవుతుంటే తెలంగాణ బిడ్డ అనే విషయం షర్మిలకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆమె రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని పెద్ది సుదర్శన్‌ రెడ్డి సూచించారు. పాకాల రంగయ్య పల్లి ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని… దాన్ని బలపరుస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా లేఖ రాశారనే విషయాన్ని గుర్తుచేశారు. కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎవరైనా పాదయాత్ర చేయొచ్చని ..ఏదైనా ఘర్షణలు జరిగితే వైఎస్ షర్మిలనే బాధ్యత వహించాలని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే పాదయాత్ర ఉద్దేశమని.. అది మర్చిపోయి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు పెద్ది సుదర్శన్‌ రెడ్డి.