తెలంగాణలో కూర్చుని ఏపిపై బురద జల్లుతున్నాడు : చంద్రబాబుకు పెద్దిరెడ్డి కౌంటర్‌

-

చంద్రబాబు తెలంగాణ లో కూర్చుని ఏపిలో పాలన పై బురద జల్లుతున్నారని.. విమర్శించే ముందు ఏపి ప్రజల మనోభావం తెలుసుకుంటే మంచిదని చంద్రబాబుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. 2019 లో 151 మంది ఎమ్మేల్యేలు, 23 మంది ఎంపిలను ప్రజలు గెలిపించారని.. ఈ సారి ఎన్నికల్లో మరింత గొప్ప విజయం అందించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

వైఎస్ జగన్ పాలన ప్రజల దృష్టిలో సంక్షేమ పాలన అని.. చంద్రబాబు, టిడిపికి మాత్రమే ఇది సైకో పాలన లా కనిపిస్తుందని ఫైర్‌ అయ్యారు. ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు పాటు సైకో పాలన సాగిందని.. డబ్బులతో ఎన్నికలకు వెళ్ళే సంస్కృతి టిడిపిదే, వైసిపి లో అలాంటి సంస్కృతి లేదని ఆగ్రహించారు.

చంద్రబాబు బినామీలు చందాలు వేసుకుని మరీ టిడిపిని అధికారం లోకి తెచ్చేందుకు ప్రయత్ని స్తున్నారని.. జగన్ సిఎం అయ్యాక ఏ కుటుంబము ఆర్థికంగా చితికి పోకుండా ఆడుకుం టున్నారని నిప్పులు చెరిగారు. కరోనా సమయంలో కూడా ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలిచిందని.. ప్రతి పిల్ల వాడు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లేలా, ప్రతి పేషంట్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేలా నాడు నేడు తో ఆదునికరిస్తున్నామని స్పష్టం చేశారు. కడుపులో ఉన్న బిడ్డ నుండి అవ్వ తాతల వరకు అందరికీ ఆర్థిక అండ లభిస్తుందని…. ఏ రాష్ట్రంలో లేని అమ్మఒడి, సచివాలయం వువస్థ ఏర్పాటు చేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news