ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే 90 % స్థానాలు వచ్చి ఉండేవి !

Join Our Community
follow manalokam on social media

నాలుగు విడతల్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం కనిపించిందని పంచాయతీ రాజ్ శాఖా మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు కుట్ర లు చేద్దాం అనుకుని చతికిల పడ్డారన్న ఆయన అయినా కొన్ని పత్రికలు టీడీపీ 50% సాధించిందని వార్తలు రాస్తున్నాయని అన్నారు. 13,095 పంచాయతీల్లో 10,524 చోట్ల అంటే 80.37% వైసీపీ మద్దతుదారులు గెలిచారని ఆయన అన్నారు. టీడీపీ 2,063 అంటే 17.75%, ఇతరులు 3.88% విజయం సాధించారని అన్నారు. ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే 90 % స్థానాలు వచ్చి ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు.

అలానే  ప్రజలందరూ ఏకపక్షంగా పట్టం కట్టారని అన్నారు. జగన్ ఒక విద్యార్థి లాగా నిత్యం సమీక్షలు చేస్తూ తీసుకుని వచ్చిన మార్పుకు ఈ ఫలితాలు తార్కాణం అని అన్నారు. ఇక కృష్ణా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న ఆయన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి జిల్లా మంత్రులతో సమావేశం అయ్యానని గ్రామాల్లో ఎటువంటి ఫలితాలు వచ్చాయో చూశాం పట్టణ ప్రాంతాల్లోనూ ప్రజల స్పందన ఇదే రకంగా ఉంటుందన్న నమ్మకం ఉందని అన్నారు. అమరావతి ప్రాంతంలోనూ వైసీపీ మద్దతుదారులే విజయం సాధించారని ఆయన పేర్కొన్నారు.

TOP STORIES

ఇక నుండి ఈ సర్వీసుల కోసం ఆర్టీవో ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు…!

మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవే (ఎంఓఆర్టిహెచ్) డ్రైవింగ్ లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కోసం కొన్ని ఆన్లైన్ పద్ధతుల్ని వివరించడం జరిగింది. గురువారం మార్చి 4న...