Pelli SandaD movie on OTT | ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న రోష‌న్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

-

Pelli SandaD movie on OTT | శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు గారి పర్యవేక్షణలో గౌరి రోనంకి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పెళ్ళిసందD’. ఆర్కా మీడియా సంస్థ‌తో క‌లిసి ఆర్కే ఫిలింస్ నిర్మాణ సంస్థ పెళ్లి సందడి సినిమా నిర్మించాయి. ఈ సినిమా కోసం ద‌ర్శ‌కేంద్రుడు కే. రాఘ‌వేంద్ర‌ర‌రావు తొలిసారిగా న‌టించారు.

దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వ‌చ్చినా.. మంచి వసూళ్ళను రాబట్టి.. కమర్షియల్ హిట్ గా నిలిచింది. విడుదలైన‌ ప‌దిరోజుల్లో ఓవ‌రాల్ గా రూ.7.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అందుకు ప్ర‌ధాన కార‌ణం కీరవాణి మ్యూజిక‌ల్ మ్యాజిక్. హీరోయిన్ శ్రీలీల గ్లామర్ తోడైనట్టు తెలుస్తుంది.

ఇక ఈ చిత్రం థియేట్రికల్ రన్ క్లైమాక్స్ కి చేరింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో కూడా సంద‌డి సిద్దం అయ్యింది. త్వ‌ర‌లోనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ కాబోతోంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ సినిమా విడుద‌ల కానుంది. విశ్వనీయ స‌మాచారం ప్ర‌కారం.. ‘పెళ్ళిసందD’ చిత్రం నవంబర్ 19న లేదా నవంబర్ 26 నుండీ డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది. థియేటర్ల లో ఈ చిత్రాన్ని చూడ‌లేని వారు.. ఎంచ‌క్క ఓటీటీలో చూడోచ్చు. తొలుత ఈ చిత్రానికి ‘ఆహా’ ఓటిటి వారు రూ.4.5 కోట్ల డిజిటల్ ఆఫర్ ఇచ్చారు. కానీ మేకర్స్ మాత్రం థియేట్రికల్ రిలీజ్ కు మక్కువ చూపార‌ట‌.

Read more RELATED
Recommended to you

Latest news