ఏపీలో మరో దారుణం..దివ్యాంగురాలిపై అత్యాచారం..!

ఏపీలో మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక ప్రాంతంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిందితులను కటినంగా శిక్షిస్తున్నా దిశ వంటి యాప్ లు తీసుకువచ్చి నిఘా పెంచిన మహిళలపై అరాచకాలు మాత్రం తగ్గటం లేదు. వరుస ఘటనలు చోటు చేసుకుంటూ ఉండటం తో ప్రజలు ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

woman was tortured and molested while her father was killed

ఇక తాజాగా మరో ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖ పట్నం లో దారుణం చోటు చేసుకుంది. దివ్యాంగురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. తన పై అత్యాచారం జరిగిందంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు స్థానిక వైసీపీ నాయకుడు వెంకట్రావు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.