2023-24 ఆర్థిక సంవత్సరంలో జగన్ రూ. 5,500 కోట్ల విద్యుత్ ఛార్జీల బాదుడికి రంగం సిద్ధం చేశాడని ఆరోపించారు టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కొనుగోళ్లలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి రూ. 3,082 కోట్ల భారం వేస్తున్నారని మండిపడ్డారు. ఏపీఈఆర్సీ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా చట్టాన్ని సవరించి మరో రూ. 2412 కోట్ల భారంతో ప్రజల్ని బాదడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు.
బాదుళ్లతో తమను వీర బాదుడు బాదుతున్న జగన్ ని ప్రజలు తమ నమ్మకంగా కాదు.. తమ జీవితాల పాలిట విలన్ గా భావిస్తున్నారని ఎద్దేవా చేశార. తన కమీషన్ల కక్కుర్తి, అధిక ధరకు విద్యుత్ కొని చేసిన అవినీతిని కప్పిపుచ్చుతూ ప్రజలపై భారంవేసేందుకు జగన్ సిద్ధమవ్వడం బాధాకరం అన్నారు. మొత్తంగా ఈ ఏప్రియల్ నుంచే జగన్ రూ.5,500 కోట్ల భారం అంటే సరాసరి నెలకు రూ.460 కోట్లు ప్రజలపై భారం వేసేందుకు రంగం సిద్ధం చేశారని ఆరోపించారు.