ఆమె పాడుతుంటే నోట్ల వర్షం.. అక్షరాల రూ. 4.50 కోట్లు గుమ్మరించిన అభిమానులు..!!

-

సంగీతాన్ని మించిన ఆనందం మరొకటి ఉండదేమో కదా.. మన మూడ్‌కు తగ్గట్టు సాంగ్స్‌ పెట్టుకుంటే.. ఆ ఫీలే వేరు.. ప్రతి లిరిక్‌ మనకోసమే రాశారా అనిపిస్తుంది. మనసుకు హత్తుకునేలా ఉంటాయి. కన్నీళ్లు పెట్టిస్తుంది, స్ట్రాంగ్‌గా చేస్తుంది, బంధాలను పెంచుతుంది.. సంగీతం ఎలాంటి మనిషిని అయినా వెన్నలా కరిగించేస్తుంది. గానంతో ప్రాణం పోయొచ్చు.. ఇంక కొందరి గానం వింటుంటే..ఎక్కడలేని ఆనందం.. పాటకోసమే పుట్టారా అనిపిస్తుంది.. జానపద గాయని గీతా రాబరి ప్రపంచ ప్రసిద్ధ గాయని. ఈమె గురించి తెలియని వాళ్లు చాలా తక్కువ ఉంటారేమో..ఆమె పాడటం ప్రారంభిస్తే.. ప్రజలు వింటూనే ఉంటారు. గుజరాత్‌ రాన్న్ ఆఫ్ కచ్‌లో రాత్రంతా గీతా రాబరి కార్యక్రమం కొనసాగింది. రాత్రంతా ఆమె పాటలు పాడుతూనే ఉంది.. స్టేజీపై నోట్ల వర్షం కురిసింది. అక్షరాలా 4 కోట్ల 50 లక్షల రూపాయలను కుమ్మరించారు.

ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నాందేవి మాత పునర్జన్మను పురస్కరించుకుని బనస్కాంత జిల్లాలో నవచండీ యజ్ఞం జరిపించారు.. గాన కోకిలగా పేరు తెచ్చుకున్న గీతా రాబరితో సంగీత భజన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

గీతా రాబరి రాన్న్ ఆఫ్ కచ్ జిల్లాలోని తప్పర్ గ్రామంలో జన్మించారు. 5వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఆమె పాడటం ప్రారంభించారు.
గీతా రాబరి భజనలు, జానపద పాటలు పాడతారు. గుజరాతీ భాషలో ఆమె పాడిన ఎన్నో పాటలు వైరల్ అయ్యాయి. ఇప్పుడే కాదు.. ఆమె ఎక్కడ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నా.. ఆమెపై నోట్ల వర్షం కురిపిస్తారు. ఆమె పాటలు వింటుంటే.. ప్రపంచాన్ని మర్చిపోతామని అభిమానులు చెబుతుంటారు. ఆమె పాటలు వింటూ వీడియో సాంగ్స్ చూడాలనుకుంటే.. యూట్యూబ్‌లో GeetaBenRabariOfficial పేరుతో ఛానెల్ ఉంది. దానికి 14 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు.

ఏది ఏమైనా.. నాలుగు కోట్లు కుమ్మరించారంటే.. ఆమె పాటలకు ఎంత క్రేజ్‌ ఉందో వేరేగా చెప్పనక్కర్లేదు..ఆ స్వరం ఆమె సొంతం.. మీరు ఒకసారి ఆమె పాటలు వినండి..మీరు ఇష్టపడొచ్చు కదా.! భావాలకు భాషతో పనిలేదు.. సంగీతం మనసుకు నచ్చితే చాలు..అది ఏ భాషలో ఉన్నా వైరల్‌ అవుతుంది.. ఇప్పుడు అలాంటి పాటలు ఎన్నో నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news