రుతుస్రావం టైం ఆసన్నమవుతుందా? అయితే బరువు పెరుగుతారు! ఎందుకో తెలుసా..

-

అసలే రోజురోజుకు బరువు పెరుగున్నారని జిమ్‌లో వర్కౌట్స్‌తో బిజీగా గడిపేస్తుంటారు. నెలంతా కష్టపడి ఆ ఐదురోజులు మాత్రం విశ్రాంతి తీసుకోవచ్చులే అనుకుంటారు. ఆ పొరపాటే చేయొద్దంటున్నారు జిమ్‌ ట్రైనర్లు. నెలలో 25రోజులు కష్టపడి ఆ రోజుల్లో దొరికింది లాగించడం వల్ల బరువుపెరిగినట్లు అనిపించడమే కాకుండా బద్ధకంగా ఉంటుంది. అలాకాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే..

– రోజూ ధరించే దుస్తులు ఆ రోజుల్లో బిగుతుగా ఉంటున్నాయని గమనించారా? అయితే గమనించండి కొంచెం అంటుకొని ఉన్నట్లుగా కనిపిస్తుంది. చాలామంది నెలవారీ ప్రతిపదికన బరువు పెరగడాన్ని పెద్దగా పట్టించుకోరు. రుతుక్రమం సమయంలో శరీరంలో జరిగే మార్పులను కూడా గమనించి ఉండకపోవచ్చు.
– పీరియడ్స్‌ దగ్గరపడడంతో రొమ్ము పరిమాణం సాధారణంగా పెరుగుతుంది. పీరియడ్స్‌ మొదలయ్యేముందు వెన్నునొప్పి, ఉబ్బరం, గరిష్ట పరిమాణంలో రక్తస్రావంతో మొదలవుతుంది. దీంతోపాటు ఈస్ట్రోజెన్‌ ప్రత్యేకంగా ఆడవారికి మాత్రమే కేటాయించబడడం దీనికి ప్రధాన కారణం. దీని ఉత్పత్తిరేటు నెలవారీ ప్రాతిపదికన ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీ శరీరం చాలా ద్రవాన్ని నిల్వ చేస్తుంది. శరీర బరువు పెరగడం కడుపునొప్పికి ఇది మూలకారణం. ఈ సమయంలో స్త్రీ శరీర ఉష్ణోగ్రత తర్వాత బరువు కొద్దిగా పెరుగుతుంది. సాధారణంగా రెండుకిలోల బరువుతోపాటు, ఈ బరువు నెలవారీ రోజుల ప్రభావం తర్వాత తగ్గుతుంది. తర్వాత మునుపటి బరవుకు తిరిగి వస్తుంది.

ఎక్కువ ఆకలి : పీరియడ్స్‌ సమయంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. దొరికిన చిప్స్‌, చాక్లెట్లు, జంక్‌ఫుడ్‌పై కోరికలు ఎక్కువగా ఉంటాయి. వాస్తవానికి ఈ సమయంలో ఇటువంటి ఆహార పదార్థాలు తినడంవల్ల సంతోషకరమైన హార్మోన్లస్థాయి పెరుగుతుంది. అధిక కేలరీలు తినడం వల్ల శరీరకొవ్వు పెరుగుతుంది. కాబట్టి వీటికి కొంచెం దూరంగా ఉండాలి. అలాగే ఆ సమయంలో వర్కౌట్స్‌ ఆపి 30 నిమిషాలు వేగంగా నడవండి. ఎందుకంటే వర్కౌట్స్‌ చేయకపోవడం వల్ల బరువు 1 నుంచి 2 కిలోల వరకు పెరుగుతుంది.

కెఫిన్‌లకు దూరంగా : కడుపునొప్పి భరించలేక చాలామంది మహిళలు గ్రీన్‌ టీ, టీ, కాఫీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. టీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. దీంతో కడుపు ఉబ్బరం వస్తుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. టీ,కాపీలకు దూరంగా ఉండాలి. పీరియడ్స్‌ మొదలయ్యే కొద్దిరోజుల ముందు ఉప్పు తగ్గించండి. అలాగే లాక్టోస్‌ కలిగి ఉన్న పాలు, ఇతర పాల ఉత్పత్తులను మానుకోండి. బీన్స్‌, క్యాబేజీ, ఉల్లిగడ్డ, సోడా మొదలైనవి తినకూడదు.

ఐరన్‌ సప్లిమెంట్స్‌ తీసుకోండి : ఐరన్‌ మాత్రలు తీసుకోవడం వల్ల మీరు అనవసరంగా అలసిపోరు. కావాలంటే మీరు తినే ఆహారాన్ని కాస్ట్‌ఐరన్‌ పాన్‌లో ఉడికించండి. ఒక్కసారిగా ఆహారం సేవించకుండా ప్రతి రెండు గంటలకు ఆహారం తీసుకుంటూ ఉండాలి. అప్పుడే మీరు తినే ఆహారం జీర్ణమై పొట్ట ప్రదేశంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. దైనందన జీవితంలో తినే ఆహారంతో పాటు శరీరానికి తగినట్లుగా వ్యాయామం చేయాలి. దీంతో ఆకలిని కూడా నియంత్రింవచ్చు. ఆ సమయంలో మీరు బరువు కూడా తగ్గువచ్చు. నీరు ఎక్కువగా తీసుకోవాలి. దీంతో శరీరంలో వాపు తగ్గుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news