ఊసపవెల్లి సినిమా ఎన్టీఆర్ తీశారు.. వాస్తవానికి పవనుకు సరిగ్గా సరిపోయేదని పేర్ని నాని సెటైర్లు పేల్చారు. పవన్ మీకు రౌడీయిజం ఇష్టం లేదా..? మరి పరిటాల రవి ఇంటికెందుకెళ్లారు..? బాగా మర్డర్లు చేశారని పలకరించడానికి వెళ్లారా..? అని నిలదీశారు. 2014లో దెందులూరులో ఎవరికి ఓటేయమని అడగడానికి పవన్ వెళ్లారు..? దెందులూరు స్వామిజీ వనజాక్షి జుట్టు పట్టుకున్నప్పుడు పవన్ ఏమైనా మాట్లాడారా..? అని ఫైర్ అయ్యారు. మూడేళ్ల నుంచి పవన్ ఏం దహించుకుపోయారు.. శుభ్రంగా సినిమాలు చేసుకుంటున్నారని.. పవన్ సినిమాలను ప్రభుత్వం ఎందుకు దెబ్బ కొడుతుంది.. వకీల్ సాబ్ సినిమాను దెబ్బ కొట్టింది ప్రజలేనని ఎద్దేవా చేశారు.
వకీల్ సాబ్ వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు తిరిగి ఇచ్చారని… గతం నుంచి తాను చేసిన కామెంట్లను ఓసారి రివైండ్ వేసుకుని చేసుకుంటే పవనుకు తన మీద తనకే అసహ్యం వేస్తుందని పేర్కొన్నారు. కుల భావన చచ్చిపోయిందని పవన్ బాధ పడడం విచిత్రంగా ఉంది.కులతత్వం ఎక్కువైపోయిందని ఎవరైనా ఆవేదన చెందుతారు.. కానీ కులభావం చచ్చిపోయిందని పవన్ అంటారేంటీ..? పవన్ నయా వివేకానందుడని చురకలు అంటించారు.
రాష్ట్రాన్ని కులాల కుంపటి చేస్తోంది చంద్రబాబే అని గతంలో కామెంట్ చేశారు.. ఆ విషయాన్ని పవన్ మరిచారని.. కాపులకు రిజర్వేషన్లేంటీ అంటూ తుని ఘటన సమయంలో చెప్పిన పవన్.. ఇప్పుడు కాపుల గురించి అదే పనిగా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. అత్యంత పచ్చి అబద్దాలు చెప్పే చంద్రబాబు కూడా సిగ్గు పడే విధంగా పవన్ మాట్లాడుతున్నారన్నారు.