నేను సన్నాసే.. పవన్ కళ్యాణ్ సన్నాసే : పేర్ని నాని

-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలపై ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ మంత్రివర్యులు పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సన్నాసి అయితే తాను కూడా సన్నాసి అని… చురకలంటించారు పేర్ని నాని. తాను సన్నాసి అయితే పవన్ కళ్యాణ్.. సన్నాసిన్నరా అని మండిపడ్డారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని తిట్టడానికి దమ్ముంది కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను తిట్టే దమ్ము పవన్ కళ్యాణ్ కు లేదని మండిపడ్డారు. సాయి ధరంతేజ్ ఘటనలో అన్యాయంగా మీడియాపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని… దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయి ధరంతేజ్ ఘటనలో పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే తెలంగాణ పోలీసులను మరియు కేసీఆర్ ను  తిట్టాలని ఫైర్ అయ్యారు. రిపబ్లిక్ ఇండియా కాబట్టి మీరు ఏది వాగినా చలామణి అయిపోతుందని… చురకలు అంటించారు. కోడి కత్తి కేసు ఎన్ఐఏ చూస్తుందని… దమ్ముంటే అమిత్ షాను కేసు వివరాలు అడగాలని సవాల్ విసిరారు పేర్ని నాని.

Read more RELATED
Recommended to you

Latest news