ట్విటర్ కొనుగోలు తర్వాత ఎలాన్ మస్క్ ఆ కంపెనీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కంపెనీలో బాసులందర్నీ గెట్ ఔట్ అన్నారు. ఇప్పుడు ఉద్యోగులను కూడా ఇంటికి పంపించేందుకు రెడీ అయ్యారు. మాస్ లే ఆఫ్స్క్ తెగబడ్డ మస్క్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సగానికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు మస్క్ సన్నాహాలు చేస్తున్నారు. వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తూ ఈ-మెయిల్స్ పంపిస్తున్నారు.
ఈ మెయిల్ అందుకున్న ఉద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ట్విటర్‌తో ఏళ్ల అనుబంధానికి తెరపడిందని కంపెనీని వీడుతూ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు.. ఉన్నపళంగా ఉద్యోగులను తొలగిస్తుండటంపై ట్విటర్‌కు వ్యతిరేకంగా కొందరు కోర్టును ఆశ్రయించారు.
ట్విటర్‌పై శాన్‌ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో దావా నమోదైనట్లు బ్లూమ్‌బర్గ్ న్యూస్ శుక్రవారం వెల్లడించింది. ఎలాంటి నోటీసు జారీ చేయకుండా ఫెడరల్, కాలిఫోర్నియా చట్టాలకు విరుద్ధంగా కంపెనీ ఉద్యోగులను తొలగిస్తోందని ట్విటర్ ఉద్యోగులు వాపోతున్నారు.