బీజేపీ, కాంగ్రెస్ నేతలపై మంత్రి కొప్పుల ఫైర్‌

-

తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నిన్న సీఎం కేసీఆర్‌ మీడీయా సమావేశంలో మొయినాబాద్‌ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై వీడియోలు విడుదల చేశారు. అయితే దీనిపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా దళిత నాయకులకు సీఎం కేసీఆర్‌ విలువ ఇవ్వడం లేదని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు కొప్పుల ఈశ్వర్. నిన్న ప్రగతి భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంత్రులను ఒక వైపు, ఎమ్మెల్యేలను మరోవైపు కూర్చోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని… తాను ఎమ్మెల్యేల వరుసలో కూర్చోవడంతో మంత్రుల వైపు కూర్చోవాలని ముఖ్యమంత్రి సూచించారని కొప్పుల ఈశ్వర్ అన్నారు.

Koppula Eshwar says to Improve facilities at VM Home | INDToday

 

ఈ విషయాన్ని తెలుసుకోకుండా… మంత్రికి, దళిత సమాజానికి అవమానం జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు కొప్పుల ఈశ్వర్. టీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబమని…కేసీఆర్ కుటుంబానికి తండ్రిలాంటి వారని… కుటుంబ సభ్యులను సంభోదించినట్టుగానే తనను సంభోదించారని చెప్పారు. హరీశ్ రావు కూడా పక్కకు జరిగి తనకు కుర్చీ ఇచ్చారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు బురద చల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని… లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు కొప్పుల ఈశ్వర్.

Read more RELATED
Recommended to you

Latest news