20 వ రోజుకు చేరిన పెట్రోల్ బాదుడు..! వాహనదారులకు చుక్కలు..!

-

petrol and diesel prices hiked for 20 th day in a row
petrol and diesel prices hiked for 20 th day in a row

కరోనా తాకిడితో ఆర్థిక రంగాలు బాగా దెబ్బతిన్నాయి అన్నీ దేశాల్లో పెట్రోల్ డీజిల్ చమురు ధరలు క్షీణించాయి, కానీ మన దేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పెట్రోల్ బాదుడు తట్టుకోలేక వాహనదారులకు పట్టపగలే చుక్కలు కనబడుతున్నాయి పెట్రోల్ డీజిల్ కొట్టించుకోలేక లబోదిబోమంటున్నారు..! గత 20 రోజులుగా భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి కాగా తాజాగా పెట్రోల్‌ పై లీటర్‌కు 21పైసలు, డీజిల్‌ లీటర్‌కు 17 పైసలు పెరిగింది. 20 రోజులు వరుసగా ధరలు పెరగడం ఇదే తొలిసారి. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర కన్నా డీజిల్ ధర పెరగడం గమనార్హం..! గత 20 రోజుల్లో పెట్రోల్‌ లీటర్‌కు రూ.8.93పైసలు, డీజిల్‌ లీటర్‌కు రూ.10.07పైసలు పెరిగాయి. దేశంలో గరిష్టంగా ముంబై లో పెట్రోల్‌ రూ. 86.70, డీజిల్‌ ధర రూ.78.34 పైసలు ఉండగా హైదరబాద్ లో పెట్రోల్‌ రూ. 82.96, డీజిల్‌ ధర రూ.78.19పైసలుగా పలుకుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news