చమురు ధరలు వాహనదారులకు షాక్ ఇస్తూనే ఉన్నాయి. దేశంలో మొత్తం 28 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అయితే.. తాజాగా శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ పై 26 పైసలు పెరగగా… డీజిల్‌పై 13 పెరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయిల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో శుక్రవారం లీటర్ పెట్రోల్ రేటు రూ. 101.60 పైసలకు పెరగగా లీటర్ డీజిల్ ధర రూ. 96.25 గా నమోదైంది. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 97.76 కాగా డీజిల్ రూ. 88.30 గా ఉంది. కోల్ కతలో లీటర్ పెట్రోల్ రూ. 97.63 కాగా డీజిల్ రూ. 91.15గా ఉంది.
ముంబైలో పెట్రోల్ రూ. 103.89 కాగా డీజిల్ రూ. 95.79గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ. 98.92గా ఉండగా డీజిల్ 92.89 గా ఉంది. స్మార్ట్ సిటీ బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.03గా ఉంది. డీజిల్ రూ. 93.61 గా ఉంది. భువనేశ్వర్ లో పెట్రోల్ రూ. 98.85 కాగా డీజిల్ రూ. 96.54 గా ఉంది. జైపూర్‌లో పెట్రోల్ ధర రూ. 104.20గా ఉండగా డీజిల్ రూ. 97.13గా ఉంది. వరుసగా ఇలా చమురు ధరలు పెరగడంపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.