ఫైజర్ కరోనా వ్యాక్సిన్ ని ఇండియాలో కొనడం కష్టం… చాలా ఖరీదు…!

కరోనా వైరస్ కు వ్యతిరేకంగా 90 శాతానికి పైగా ప్రభావంతంగా పని చేస్తున్న ఫైజర్ కరోనా వ్యాక్సిన్ ఖరీదైనది అని… భారత దేశంలో కొనుగోలు చేయడం కష్టం అని వెల్లూరు సిఎంసి ప్రొఫెసర్ చెప్పారు. మెడికల్ శాస్త్రవేత్త అయిన డాక్టర్ గంగా దీప్ దీనిపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఫైజర్ కరోనా వ్యాక్సిన్ అనేది చాలా ఖరీదు అయినది అని, అసలు దాన్ని ఎంతకు విక్రయిస్తారు అనే దానిపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు అని చెప్పారు.

మోడరోనా వారి కరోనా వైరస్ వ్యాక్సిన్ ధర ఒక్కో మోతాదుకు 37 అమెరికన్ డాలర్లు… అంటే మన కరెన్సీలో రూ .2,746 గా ఉంటుందని చెప్పారు. ఫైజర్‌ భారత్ లో తమ వ్యాక్సిన్ ని ప్రవేశ పెట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే చర్చలకు సిద్దంగా ఉన్నామని ఇండియా ప్రకటన చేసింది. ఇక ఈ వ్యాక్సిన్ కోసం అమెరికా ప్రయత్నాలు చేస్తుంది.