ఫైజర్ టీకా ప్రయోగం… ఇద్దరికి సైడ్ ఎఫెక్ట్స్..!

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా వైరస్ ని అరికట్టడానికి ప్రపంచదేశాల శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. కరోనా వ్యాక్సిన్‌ మూడో దశ ట్రయల్స్‌ నిర్వహిస్తున్న అమెరికన్‌ ఫార్మా సంస్థ ఫైజర్‌ శుభవార్త చెప్పింది. తాము చేస్తున్న మూడో దశ ప్రయోగాలు విజయవంతమయ్యాయని తెలిపిన సంగతి విదితమే.

pfizer
pfizer

తాజా సమాచారం ప్రకారం.. ఫైజర్ వ్యాక్సిన్ వాడుతున్న వాలంటీర్లపై దుష్ర్పభావం చూపిస్తున్నట్లు తెలిసింది. ఆ మేరకు ది ఇండిపెండెంట్ పత్రికలో వెలువడిన కథనాలు ఇలా ఉన్నాయి. సాధారణంగా వైరస్ కి సంబంధించిన టీకాలు వేసుకున్నప్పుడు జ్వరం, నొప్పి వస్తాయి. అయితే ఫైజర్ టీకా వేసుకున్నాక నొప్పితో పాటు తల నొప్పి తీవ్రమైన హ్యాంగోవర్ ఉంటుందని వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లు వెల్లడించారు. అయితే ఫైజర్ టీకాను యూకో ప్రభుత్వం అత్యవసరమైన వారికి ప్రయోగాత్మకంగా అందిస్తోంది. కోవిడ్ లక్షణాలు ఎక్కువ ఉన్న వ్యాధిగ్రస్తులకు, ఆస్పత్రల్లో పని చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి ఇప్పటికే టీకాను బ్రిటన్ ప్రభుత్వం అందించడం ప్రారంభించింది.

ఫైజర్ టీకాను బ్రిటన్ ఎన్‌హెచ్ స్టాఫ్ కు అందించగా… ఇద్దరికి సైడ్ ఎఫెక్ట్స్ బయటపడ్డాయి. స్పందించిన ప్రభుత్వం వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు కోలుకుంటున్నారని పేర్కొంది. అయితే ప్రయోగాత్మకంగా టీకా తీసుకున్న వారిలో దురద, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్న వారు వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచించింది. కాగా, ప్రభుత్వం ఫైజర్ టీకాను ఇప్పిటికే కరోనా లక్షణాలు ఉన్న వారు టీకాను తీసుకోవద్దని సూచిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news