ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ కస్టమర్లే టార్గెట్‌!

-

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్‌. కేవలం ఆ బ్యాంకుల కస్టమర్లనే హ్యాకర్స్‌ టార్గెట్‌ చేశారు. ఫేక్‌ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా దోపిడీ చేస్తున్నారు. కొద్దిపాటి నిర్లక్ష్యం ఉన్న ఖాతా డబ్బులు మాయం అవుతాయి. ఇటీవలె ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులు ఫిషింగ్‌ సందేశాలతో జాగ్రత్త వహించాలని సూచించారు. పన్ను రిఫండ్‌ సందేశాలతో అలర్ట్‌గా ఉండాలని కోరింది. ట్విట్టర్‌ వేదికగ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎస్‌ఎంఎస్‌లో వచ్చే లింక్స్‌పై క్లిక్‌ చేయవద్దని తెలిపింది.

న్యూఢిల్లీకి చెందిన సైబర్‌పీస్‌ ఫౌండేషన్, సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఆటోబాట్‌ ఇన్ఫోసెక్‌ సంయుక్తంగా దర్యాప్తు చేశాయి. దీనిలో విస్తుగొలిపే అంశాలు వెల్లడయ్యాయి. బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా , హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌ , పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ లను మోసగాళ్లు టార్గెట్‌ చేశారు. ఈ బ్యాంకులకు సంబంధించిన ఖాతాదారులను సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌ చేశారు. ఇందులో భాగంగానే ఫిషింగ్‌ స్కామ్‌లకు పాల్పడుతున్నారు.

వీరికి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఆదాయపు పన్ను రిఫండ్‌ అప్లికేషన్‌ సమర్పించాలని కోరుతూ మెసేజ్‌లు సెండ్‌ చేస్తున్నారు. వీటిల్లో మోసపూరిత లింక్స్‌ పెట్టి మోసాలకు పాల్పడుతున్నారు.

ఇది తెలియని ఖాతాదారుల్లు వచ్చిన ఎస్‌ఎంఎస్‌లోకి లింక్‌పైన క్లిక్‌ చేయడం ద్వారా ఆదాయపు పన్ను ఇఫైలింగ్‌ వెబ్‌సైట్‌ను పోలిన మోసపూరిత వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది. దీని ద్వారా సైబర్‌ క్రిమినల్స్‌ బ్యాంక్‌ ఖాతాదారుల వివరాలు తస్కరిస్తున్నారు. అమెరికా, ఫ్రాన్స్‌ ‌ వంటి దేశాల నుంచి మోసపూర్తి లింక్స్‌ జనరేట్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి మోసపూరిత లింక్స్‌ ఓపెన్‌ చేసి ఇప్పటికే కొంతమంది తమ డబ్బులను పోగొట్టుకున్నారు. కాబట్టి బ్యాంకు ఖాతాదారులు తెలియని ఎస్‌ఎంఎస్‌ లింక్‌లపై క్లిక్‌ చేయకుండా జాగ్రత్త వహించండి.

Read more RELATED
Recommended to you

Latest news