పాన్ కార్డులో ఫోటో ని మార్చాలా..? ఇలా ఈజీ మరి..!

-

మనకు వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో పాన్ కార్డు కూడా ఒకటి. పాన్ కార్డు వలన చాలా ఉపయోగాలు వున్నాయి. బ్యాంకుకు సంబంధించిన ట్రాన్సక్షన్స్ మొదలు ఎన్నో వాటికి పాన్ కార్డు తప్పక ఉండాలి. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కోసం కూడా ఈ పాన్ కార్డు ఉండాలి. పాన్ కార్డు మీద మన ఫోటో ఉంటుంది. అయితే ఫోటో ని మార్చుకోవాలంటే ఇలా చెయ్యండి. పాన్‌ కార్డుల్లో మీ ఫోటో స్పష్టంగా కనపడకుండా వుంటుంటే ఇలా ఫోటో ని మార్చుకోవచ్చు. అది కూడా మీరు ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఇంట్లో ఇలా చేస్తే సరిపోతుంది. ఫోటో బ్లర్‌గా ఉంటే ఈజీగా ఇలా మార్చేయవచ్చు. మరి అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

దీని కోసం మొదట మీరు NSDL అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
నెక్స్ట్ మీరు అప్లై ఆన్‌లైన్, రిజిస్టర్డ్ యూజర్ ఆప్షన్ మీద క్లిక్ చెయ్యండి.
దీనిలో మీరు అప్లికేషన్ టైప్ ఆప్షన్‌కి వెళ్ళాలి.
దీనిలో పాన్ ని మార్చండి ఆప్షన్ ని ఎంచుకోవాలి.
ఇప్పుడు మార్పులు చేర్పులకు సంబంధించిన ఆప్షన్‌ను సెలెక్ట్ చేసి.. డీటెయిల్స్ ని ఇవ్వండి.
క్యాప్చా కోడ్‌ను కూడా ఎంటర్ చేసేసి… తర్వాత కేవైసీని కంప్లీట్ చెయ్యండి.
నెక్స్ట్ మీరు ఫోటో సరిపోలలేదు ఆప్షన్ ని చూస్తారు. డీటెయిల్స్ ని ఇచ్చేసేయండి.
ID రుజువును సబ్మిట్ చేసి డిక్లరేషన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చెయ్యండి.
ఫోటోను ఆన్‌లైన్‌లో మార్చుకోవడానికి కొంత అమౌంట్ ని పే చెయ్యాల్సి ఉంటుంది.
ఆ తర్వాతనే ఫోటో మార్చేందుకు అవుతుంది.
రెసిప్ట్ వచ్చాకనే మీరు ఫోటోను మార్చడానికి నింపిన ఫారమ్ ప్రింటవుట్ తీసుకోచ్చు.
దీన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ పాన్ సర్వీస్ యూనిట్‌కి సెండ్ చెయ్యాలి.
అప్పుడే ఫోటో మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news